భారతీయుల్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లలో ఇండియన్ ఎంబసీ
- April 08, 2020
ఒమాన్: ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్, స్వదేశానికి వివిధ కారణాలతో వచ్చేయాలనుకుంటున్న వలసదారుల డేటాని కలెక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వలసదారుడు, ఒమన్లోని ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్లో, వివధ ఎంబసీలు, డేటాని కలెక్ట్ చేస్తున్నాయనీ, తమ పౌరుల్ని తమ దేశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, తమను కూడా ఇండియాకి పంపించాలని రమీజ్ ఖాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. కాగా, పూర్తి డిటెయిల్స్ని ఎంబసీకి ఇ-మెయిల్ ([email protected]) చేయాలని ఎంబసీ అధికారులు సూచించారు. మరోపక్క, ఇండియన్ ఎంబసీ అధికారి మాట్లాడుతూ, ఏప్రిల్ 14 తర్వాత ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నవారి వివరాల్ని ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంటోందనీ, ఆయా వ్యక్తుల ఎమర్జన్సీని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఒమన్లోని ఇండియన్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయనీ, ఈ మేరకు తాము ఓ లిస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు ఆ ఎంబసీ అధికారి.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







