కువైట్:ప్రైవేటు కంపెనీ కార్మికులు అరెస్ట్‌

- April 09, 2020 , by Maagulf
కువైట్:ప్రైవేటు కంపెనీ కార్మికులు అరెస్ట్‌

కువైట్‌ ఇంటరీయిర్‌ మినిస్ట్రీ ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్‌ చేసింది. ఓ ప్రైవేటు కంపెనీ రిప్రెజెంటేటివ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. కొంతమంది కార్మికులు  ఒకే చోట చేరి, తనపై దాడికి యత్నించారనీ, జీతాలు ఇచ్చే సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు సదరు కంపెనీ ప్రతినిది¸. సమాచారం అందుకోగానే, రెస్క్యూ పెట్రోల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ కారు మీద కూడా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com