సౌదీ అరేబియా:ఎగ్జిట్‌, రీ-ఎంట్రీ వీసా గడువు పెంపు

- April 09, 2020 , by Maagulf
సౌదీ అరేబియా:ఎగ్జిట్‌, రీ-ఎంట్రీ వీసా గడువు పెంపు

సౌదీ అరేబియా:కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌, కోవిడ్‌-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పౌరులు అలాగే వలసదారుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇదిలా వుంటే ఫిబ్రవరి 25 నుంచి మే 24 మధ్య గడువు ముగిసే ఎగ్జిట్‌ మరియు రీ-ఎంట్రీ వీసాల పరిమితిని మరో మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కింగ్‌ సల్మాన్‌. ఈ పెంపు ఉచితంగానే లభిస్తుంది వలసదారులకు. కమర్షియల్‌ మరియు ఇండస్ట్రియల్‌ ప్రొఫెషన్స్‌కి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ ఆటోమేటిక్‌గా జరుగుతుందనీ, హెడ్‌ క్వార్టర్స్‌ని సంప్రదించాల్సిన పనిలేదని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ స్పష్టతనిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com