మస్కట్:అద్దెలు, లోన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించిన OCCI
- April 09, 2020
మస్కట్:కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్ధిక గమనమే మందగించింది. లాక్ డౌన్, కర్ఫ్యూలతో జనం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ OCCI షాపు మడిగెల ఓనర్లకు, రియల్ ఎస్టేట్ వర్గాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఓనర్లు, రియల్టర్లు అద్దె కోసం ప్రజలను ఒత్తిడి చేయొద్దని సూచించింది. వారికి కొంత రాయితీలనుగానీ, లేదంటే వాయిదాలనుగానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు బ్యాంకర్లు కూడా లోన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని OCCI సూచించింది. దేశంలోని పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలు కూడా వాయిదాలు చెల్లించలేని పరిస్థులు ఎదుర్కుంటున్నాయని, ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు అందే పరిస్థితులు లేవు కనుక లోన్లు, ఈఎంఐల వసూలును ఆరు నెలల వరకు వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది. అదీ కూడా వినియోగదారులకు ఎలాంటి ఇంట్రస్ట్ ల భారం వేయొద్దని కూడా ఫైనాన్స్ సంస్థలకు తెలిపింది. ఇక ఎవరైనా ఉద్యోగులు అత్యవసరమై లోన్ల కోసం వస్తే వారిని వేధించకుండా కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపోను లోన్ల వరకు మంజూరు చేయాలని కూడా OCCI తన సూచనల్లో పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







