మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ద్వారా అల్‌ ముజైని ఎక్స్‌ఛేంజ్‌ సేవలు

- April 09, 2020 , by Maagulf
మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ద్వారా అల్‌ ముజైని ఎక్స్‌ఛేంజ్‌ సేవలు

కువైట్‌: కరోనా వైరస్‌ క్రైసిస్‌ నేపథ్యంలో అల్‌ ముజైని ఎక్స్‌ఛేంజ్‌ కంపెనీ, మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ద్వారా కరోనా వైరస్‌ పట్ల అవగాహన కల్పించడంతోపాటు, పలు రకాల సేవల్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటి నుంచే తమ రెమిటెన్స్‌ని ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా చేపట్టడానికి వీలవుతుంది. తేలికగా, భద్రతతో కూడిన విధంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆండ్రాయిడ్‌, ఐ ఫోన్‌ యూజర్స్‌కి వీలుగా ఈ యాప్‌ని రూపొందించారు. 1942 నుంచి అల్‌ ముజైని ఎక్స్‌ఛేంజ్‌ కంపెనీ, మనీ ట్రాన్స్‌ఫర్‌ విభాగంలో ముందంజలో వుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com