కువైట్:వాలంటీర్లుగా ప్రైవేట్ వైద్య సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి

- April 10, 2020 , by Maagulf
కువైట్:వాలంటీర్లుగా ప్రైవేట్ వైద్య సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి

కువైట్:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది సేవలను వినిగియోంచుకునేందుకు కువైట్ ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వాలంటీర్లుగా డాక్టర్లు, నర్సులు సేవలు అందించాలని కోరింది. కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమ బాధ్యతగా భాగస్వామ్యం కావాలనుకునే డాక్టర్లు, నర్సులు ఏప్రిల్ 12 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్య సాయం అందించాలనుకునే డాక్టర్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ టెక్నికల్ అఫైర్స్ ఆఫీసులో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నర్సులు అయితే అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ మెడికల్ సర్వీసెస్ లో దరఖాస్తు చేయాలి. ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు ప్రాక్టిసింగ్ లైసెన్స్, సివిల్ ఐడీ కార్డు, వారు పని చేసే కంపెనీ నుంచి అనుమతి లేటర్ ను జత చేయాల్సి ఉంటుంది. 


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com