రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం

- April 11, 2020 , by Maagulf
రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం

మస్కట్‌: దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో ఓ వ్యక్తిని కోస్ట్‌ గార్డ్‌ పోలీస్‌ రక్షించారు. ఈ మేరకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమైనట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. కోస్ట్‌ గార్డ్‌ పోలీస్‌కి చెందిన మెరైన్‌ రెస్క్యూ టీమ్ ఈ ఆపరేషన్‌ని నిర్వహించింది. రేసత్‌ ఏరియాలో ఓ వ్యక్తి సముద్ర తీరం నుంచి కొట్టుకుపోగా, అతన్ని రెస్క్యూ చేశారు. ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం అతన్ని ఆసుపత్రికి పోలీస్‌ అంబులెన్స్‌ ద్వారా తరలించారు. సుల్తాన్‌ కబూస్‌ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స జరుగుతోంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com