ఇంధన ధరల్ని తగ్గించిన సౌదీ అరేబియా

- April 11, 2020 , by Maagulf
ఇంధన ధరల్ని తగ్గించిన సౌదీ అరేబియా

రియాద్‌: సౌదీ అరామ్ కో, ఇంధన ధరల్ని తగ్గించింది. ఏప్రిల్‌ 11 నుంచి ఈ తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. గ్యాసోలిన్‌ 91 ధర 1.55 సౌదీ రియాల్స్‌ నుంచి 1.31 సౌదీ రియాల్స్‌కి (లీటర్‌) తగ్గింది. గ్యాసోలైన్‌ 95 ధర 2.05 నుంచి 1.47 సౌదీ రియాల్స్‌కి తగ్గింది. శనివారం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌కి అనుగుణంగా ఎక్స్‌పోర్ట్‌ ధరలతో సౌదీ అరేబియాలో ఇంధన ధరల సవరణ జరుగుతుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com