కోవిడ్-19 హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన వైఎస్ జగన్
- April 11, 2020
ఏ.పి: సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వదంతులకు తావు లేకుండా కచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది. వాట్సాప్ లో 8297104104 నెంబర్ ద్వారా, ఫేస్బుక్లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా కోవిడ్-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







