రియాద్:లంచం తిరస్కరించిన పోలీస్ అధికారిపై దాడి

- April 12, 2020 , by Maagulf
రియాద్:లంచం తిరస్కరించిన పోలీస్ అధికారిపై దాడి

రియాద్:ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా కొందరు యువకులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. సౌదీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీకెండ్ కావటంతో ఓ యువకుడు లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ బైక్ పై రోడ్డెక్కాడు. అయితే..గస్తీలో ఉన్న పోలీసు అతన్ని ఆపటంతో అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే..ఆ పోలీస్ అధికారి లంచం తీసుకునేందుకు నిరాకరించటంతో ఏకంగా అఫీసర్ పైనే దాడికి తెగడబ్డాడు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి తుదపరి విచారణకు తరలించింది. ఇదిలాఉంటే..మరో కేసులో తీర్పులను ప్రభావితం చేసేలా జడ్జి, మిలటరీ కల్నల్ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు అవినీతి శాఖ అధికారులు వెల్లడించారు. జడ్జి, కల్నల్ ఇద్దరు అన్నాదమ్ములని, ఈ కేసులో ఓ వ్యాపారవేత్త, మరో న్యాయవాది ప్రమేయం కూడా ఉందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com