యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు
- April 12, 2020
యూఏఈ:కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది యూఏఈ ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 49,000 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా జరిపిప పరీక్షల ఫలితంగా కొత్తగా 370 పాజిటీవ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వివిధ దేశాల పౌరులు ఉన్నారని, అయితే వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం నమోదైన ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,360కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే కరోనాతో ఆసియా దేశాలకు చెందిన ఇద్దరు చనిపోయారని అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







