కరోనా/అబుధాబి: కార్మికుల రాకపోకలపై షరతులు

- April 13, 2020 , by Maagulf
కరోనా/అబుధాబి: కార్మికుల రాకపోకలపై షరతులు

అబుధాబి: కరోనా ను కట్టడి చేసేందుకు యూఏఈ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా అబుధాబిలో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను అబుదాబి నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, వారి ప్రయాణాన్ని అబుధాబి/అల్ ఐన్/అల్ ధఫ్రా పరిధిలో పరిమితం చేస్తారని, అంతే కాదు, ఇతర ఎమిరేట్ల నుండి కార్మికులు అబుధాబిలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధిస్తుంది అంటూ అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం తెలిపింది. ఈ చర్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి, కరోనా వ్యాపించటాన్ని తగ్గించడానికి నివారణ చర్యగా అభివర్ణించింది మీడియా కార్యాలయం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com