యూఏఈ విసిట్/టూరిస్ట్ వీసాల గడువుపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
- April 14, 2020
దుబాయ్: కరోనా తో అన్ని దేశాలలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మరి యూఏఈ కి వివిధ కారణాల వల్ల వచ్చినవారికి వీసాలపై అనేక అనుమానాలు వ్యక్తమతున్నాయి. రెసిడెన్సీ వీసాలపై గడువును 2020 చివరి వరకు పొడిగించారు. అయితే విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినవారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఈరోజు క్లారిటీ ఇచ్చారు.
మీరు యూఏఈ కు విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినట్టయితే, మీ వీసాలు 2020 చివరి వరకు చెల్లుబాటు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఈ నిబంధన కేవలం March 1,2020 తర్వాత గడువు తీరుతున్న వీసాలపై మాత్రమే అని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మీడియా సమావేశంలో తెలిపింది.
నివాసితులు/ప్రవాసీయులు తమకు గల ఏదైనా సందేహాలను GDRFA-దుబాయ్ యొక్క 'అమెర్' కాల్ సెంటర్ 8005111 (యూఏఈ లో ఉన్నట్లయితే) లేదా +97143139999 (యూఏఈ వెలుపల ఉన్నట్లయితే) కు కాల్ చేసి నివృత్తిచేసుకోవచ్చు. లేదా [email protected] లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు అని ఈ సందర్భగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..