ఆన్‌లైన్‌ సివిల్‌ ఐడీ యాప్‌ని ప్రారంభించిన పిఎసిఐ

- April 14, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌ సివిల్‌ ఐడీ యాప్‌ని ప్రారంభించిన పిఎసిఐ

కువైట్:పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ) ఆన్‌లైన్‌ సివిల్‌ ఐడీ యాప్‌ ‘కువైట్‌ మొబైల్‌ ఐడీ’ని ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ తమ ఐడీని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తీసుకెళ్ళొచ్చు. ఐఫోన్‌ అలాగే ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్స్ పై ఇది పనిచేస్తుంది. కువైన మొబైల్‌ ఐడీ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులో ఎన్‌రోల్‌ కావాల్సి వుంటుంది. అరబిక్‌ మరియు ఇంగ్లీషులలో ఈ యాప్‌ని రూపొందించారు. సివిల్‌ ఐడీ నెంబర్‌ని వినియోగించి యాప్‌లో ఎన్‌రోల్‌ అవ్వొచ్చు. సీరియల్‌ నెంబర్‌, పాస్‌పోర్ట్‌ నంబర్‌ అలాగే సెల్ఫీ ఫొటో వీటిలో పొందుపర్చాలి. ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఈ యాప్‌ ఉపయోగపడ్తుంది. డిజిటల్లీ సైన్‌ డాక్యుమెంట్స్‌ మరియు ట్రాన్సాక్షన్స్‌కి కూడా ఈ యాప్‌ని వినియోగించొచ్చు. ప్లే స్టోర్‌, ఐ స్టోర్‌ ద్వారా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వుంటుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com