దుబాయ్‌: పాస్‌పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించిన భారత కాన్సులేట్

- April 14, 2020 , by Maagulf
దుబాయ్‌: పాస్‌పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించిన భారత కాన్సులేట్

దుబాయ్: కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో పాస్‌పోర్ట్ సేవలను నిలిపివేశారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఏప్రిల్ 15 నుంచి బీఎల్‌ఎస్ షార్జా సెంటర్(King Faisal Street, Sharjah) ద్వారా భారతీయ దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించనుంది. ముందుగా ఏప్రిల్ 30, 2020 న లేదా అంతకు ముందే గడువు ముగిసిన/ముగియనున్న పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపిన అధికారులు. 

పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పునరుద్ధరణ కోసం అత్యవసర పరిస్థితుల వివరణతో [email protected] కు ఇమెయిల్ చేయగలరు. దీనిద్వారా షార్జాలోని 'బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఎక్స్‌క్లూజివ్ సెంటర్ ఫర్ ఇండియన్ పాస్‌పోర్ట్ అండ్ వీసా సర్వీసెస్‌'లో అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తుంది కాన్సులేట్. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచినా అన్ని పత్రాలను సిద్ధం చేసుకొని మాత్రమే బీఎల్‌ఎస్ షార్జా సెంటర్ కు వెళ్లాలని ప్రకటించిన అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com