కరోనా/దుబాయ్: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 14, 2020
దుబాయ్: కరోనా ను కట్టడి చేసేందుకు యూఏఈ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా దుబాయ్ లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను దుబాయ్ నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, అలాగే దుబాయ్ బయట నుండి వచ్చేవారిని సైతం అనుమతించబోమని తాజాగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, అబుదాబి కూడా అబుదాబి లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను అబుదాబి నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, వారి ప్రయాణాన్ని అబుధాబి/అల్ ఐన్/అల్ ధఫ్రా పరిధిలో పరిమితం చేస్తారని, అంతే కాదు, ఇతర ఎమిరేట్ల నుండి కార్మికులు అబుధాబిలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధిస్తుంది అంటూ అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం తెలిపింది.
ఈ చర్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి, కరోనా వ్యాపించటాన్ని తగ్గించడానికి నివారణ చర్యగా అభివర్ణించింది మీడియా కార్యాలయం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు