లాక్‌డౌన్ పొడిగింపుతో విమాన ప్రయాణికులకు షాక్..

- April 15, 2020 , by Maagulf
లాక్‌డౌన్ పొడిగింపుతో విమాన ప్రయాణికులకు షాక్..

ముంబై:కరోనా వైరస్‌ను నివారించడానికి భారత దేశవ్యాప్తంగా తొలి విడతలో విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని, ఆ తర్వాత ప్రయాణాలకు అనుమతిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుని.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందటం.. వైరస్ తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుకింగ్‌లను విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అయితే, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ అలాంటి రిఫండ్స్ ఏమీ ఉండవని పలు కంపెనీలు స్పష్టం చేశాయి. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ బుకింగ్‌లను రద్దు చేశామని, ఆ టికెట్లకు రిఫండ్ ఉండవని వెల్లడించాయి. టికెట్లు తీసుకున్న వారు మాత్రం.. లాక్‌డౌన్ తర్వాత వాటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నాయి. అవి ఈ ఏడాది చివరవరకూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నాయి. కాగా స్పైస్‌జెట్ లాంటి కంపెనీలు 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ టికెట్లను వాడుకోవచ్చని తెలిపాయి. ఇండిగో, విస్తారా లాంటి ఎయిర్‌లైన్స్ మాత్రం 2020 డిసెంబర్ 31వరకూ వాడుకోవచ్చని తెలియజేశాయి.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com