ఫేక్ రీపాట్రియేషన్ సర్క్యులర్‌పై భారత వలసదారులకు హెచ్చరిక
- April 15, 2020
అబుధాబి:రీపాట్రియేషన్(స్వదేశానికి తరలింపు) విషయమై సర్క్యులేట్ అవుతున్న ఓ ఫేక్ సర్క్యులర్‌పై భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది ఇండియన్ మిషన్స్. కరోనా కారణంగా చిక్కుకుపోయిన వలసదారులు, విజిట్ వీసా హోల్డర్స్, పెద్దలు అలాగే ఉద్యోగాల్లేనివారు తమ వ్యక్తిగత సమాచారాన్ని మిషన్స్‌కి పంపాల్సిందిగా ఓ ఫేక్ సర్క్యులర్ ప్రచారంలోకి వచ్చింది. దీనిపై స్పందించిన ఇండియన్ ఎంబసీ, అదంతా ఫేక్ అని తేల్చి చెప్పింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ విషయాన్ని ఖండిస్తూ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ బహిర్గతం చేయరాదని హెచ్చరించింది. కాగా, భారత సుప్రీంకోర్టు, ఎయిర్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వున్నంతవరకు వలసదారులెవరూ తిరిగి భారతదేశానికి రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇదిలా వుంటే, కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా వున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మే 3వ తేదీ వరకూ పొడిగించిన విషయం విదితమే. కాగా, రీపాట్రియేషన్పై ఎలాంటి అధికారిక సమాచారమైనా ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి అందుతుందనీ, ఎవరూ ఫేక్ ప్రచారాల్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. యూఏఈలో భారత అండాసిడర్ అయిన పవన్ కపూర్ మాట్లాడుతూ, డిస్ట్రెస్స్డ్ వలసదారులు, ఇ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే, వారికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. మెడికల్, సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం వున్నవారికీ తగిన సహాయం అందిస్తామని తెలిపారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో వలసదారులు హెల్ప్‌లైన్ నెంబర్ 0508995583కి సంప్రదించవచ్చు లేదా ఈ మెయిల్ ఐడి [email protected]. కి ఇమెయిల్ చేయగలరు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







