కరోనా వైరస్‌పై పుకార్లు: స్పందించిన ప్రభుత్వం
- April 16, 2020
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్, కోరోనా వైరస్ విషయంలో సర్క్యులేట్ అవుతున్న పుకార్లని ఎవరూ నమ్మవద్దని సూచించింది. కరోనా వైరస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పేర్కొంది. మస్కట్ బేకరీలో కరోనా వైరస్.. అంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఏప్రిల్ 2న ఓ అధికారిక ప్రకటన వచ్చిందనీ, ఆ ప్రకటన ప్రకారం కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 57 అంటూ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పాత ప్రకటన వివరాల్ని వెల్లడించింది. పుకార్ల పట్ల ఆకర్షితులవడం మంచిది కాదనీ, అదే సమయంలో ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ‘అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం’ అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







