అబుధాబి:ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ISC) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- April 18, 2020
అబుధాబి:కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఏవిధంగా భాధ పెడుతుందో అదే మాదిరి యు ఏ ఈ కూడా ఈ మహమ్మారి బారిన పడిన కారణంగా లక్షలాది మంది భారతీయుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం అయ్యింది. కరోనా దెబ్బ తో ఎంతో మంది భారతీయులు జీవనోపాధి కోల్పోవడం మరియు వేతనాలు చెల్లించక మరియు మరి కొంత మంది విసిట్ వీసాల పై వచ్చి ఇక్కడే చిక్కుక పోయి తినడానికి కూడా తిండి లేక ఇక్కట్ల పాలు అవుతున్నారు.వీరందరిని మేము ఉన్నాము అంటూ అబుధాబి లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ISC) వారు ముందుకు వచ్చారు.ISC గత 52 సంవత్సరాలు గా యూ.ఏ.ఈ లోని భారతీయ సంతతి వారికి ఎన్నో రకాలు గా సేవలు చేస్తూ వస్తున్నారు.దాని క్రమం లోనే ఈ మహమ్మారి ని ఎదుర్కొనేందుకు ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న కోవిడ్ 19 చర్యలలో ఎంతో చురుకు గా పాలుపంచుకుంటున్నారు.ఈ కార్యక్రమం లో భాగంగా ఎంతో మంది అన్నార్తులైన భారతీయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరి కి 3 వారాలకు సరిపోయే వంట సామాగ్రి ని అందజేస్తున్నారు.ఈ సరుకులన్నీ నిరంతరాయంగా అందజేస్తామని ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్య దాత గా వ్యవహరిస్తున్న LULU ఎక్స్చేంజి Strategy & Business గ్రూప్ అధినేత అజిత్ జాన్సన్ తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని కోవిడ్ 19 ని యు ఏ ఈ నుండి తరిమివేసే వరకు చేస్తుంటామని ISC అధ్యక్షులు యోగేష్ ప్రభు మరియు ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలియజేశారు.ఇవే కాకుండా అన్ని కార్మిక గృహాలలో మరియు COVID 19 బాధితులకు పేస్ మాస్కులు, శానిటైజర్, డేటాయిల్ మరియు చేతి గ్లౌజులు కూడా అందజేస్తున్నామని సంఘ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు తెలియజేశారు.ఇవే కాకుండా యూ.ఏ.ఈ లో కేసులతీవ్రత ఎక్కవ ఉండడం తో ఇక్కడి ప్రభుత్వానికి చేదోడు వాదోడు అవ్వడానికి సంఘం తరుపున ఐసోలేషన్ సెంటర్ లు ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేశామని సంఘ కోశాధికారి షిజిల్ మరియు సాంస్కృతిక కార్యదర్శి జయప్రదీప్ తెలియ జేశారు.ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం లో సంఘ కార్యవర్గ సభ్యులు అందరు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







