బహ్రెయిన్:ర్యాండమ్ కోవిడ్-19 టెస్టింగ్
- April 18, 2020
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌ని రాండమ్ గా సెలక్ట్ చేసి, వారికి కరోనా వైరస్ (కోవిడ్19) పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రతి హౌసింగ్ బ్లాక్ నుంచి 20 మందిని ఇ-గవర్నమెంట్ అథారిటీ సెలక్ట్ చేసి, పరీక్షలు నిర్వహిస్తుంది. ఇలా 12 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ఆయా వ్యక్తులకు ముందుగానే సమాచారం అందిస్తారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టెస్టింగ్ ఫెసిలిటీ ద్వారా వైద్య పరీక్షలు జరుగుతాయి. ఐడెంటిఫికేషన్ నిమిత్తం చెల్లుబాటయ్యే ఐడీని ఆయా వ్యక్తులు తీసుకురావాల్సి వుంటుంది. 9,000కి పైగా కరోనా వైరస్ టెస్టుల్ని ర్యాండమ్ గా నిర్వహించనున్నారు. ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చు. అయితే, వారంతా ఒకే వాహనంలో పరీక్షలకు రావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







