500 మిలియన్‌ డాలర్ల డొనేషన్‌: సౌదీని అభినందించిన డబ్ల్యుహెచ్‌వో

- April 18, 2020 , by Maagulf
500 మిలియన్‌ డాలర్ల డొనేషన్‌: సౌదీని అభినందించిన డబ్ల్యుహెచ్‌వో

సౌదీ అరేబియా: వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌కి అభినందనలు తెలిపింది. కరోనా వైరస్‌పై పోరు కోసం సౌదీ అరేబియా 500 మిలియన్‌ డాలర్లను డబ్ల్యుహెచ్‌వోకి డొనేట్‌ చేసిన దరిమిలా, ఈ మేరకు డబ్ల్యుహెచ్‌వో కృతజ్ఞతలు తెలిపింది. డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధానం ఘెబ్రీయెసుస్‌ ఓ ప్రకటనలో సౌదీ అరేబియాకీ, సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌కీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరు.. సంబంధిత వ్యవహారాల కోసం ఈ మొత్తాన్ని డొనేట్‌ చేయడం జరిగింది. కాగా, కరోనా వైరస్‌ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 150,000 మందిని బలిగొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com