రమదాన్‌: తగ్గించిన ధరల్ని ప్రకటించిన ఎంఓసిఐ

- April 18, 2020 , by Maagulf
రమదాన్‌: తగ్గించిన ధరల్ని ప్రకటించిన ఎంఓసిఐ

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, రమదాన్‌ నేపథ్యంలో 500కి పైగా ప్రోడక్ట్స్‌పై డిస్కౌంట్‌ ధరల్ని ప్రకటించింది. శనివారం నుంచి రమదాన్‌ పూర్తయ్యేవరకు ఈ ధరలు అమల్లో వుంటాయి. సూపర్‌ మార్కెట్స్‌తో కలిసి ఈ తగ్గించిన ధరల్ని ప్రకటించారు. సిటిజన్స్‌ మరియు రెసిడెంట్స్‌, పవిత్ర రమదాన్‌ మాసాన్ని ఆనందంగా జరుపుకోవడానికి వీలుగా, వారికి తక్కువ ధరలోనే అవసరమైన వస్తువులు దొరికేలా ఈ తగ్గింపు ధరల్ని ప్రతి యేడాదీ అమలు చేస్తున్నారు. ఫ్లోర్‌, షుగర్‌, రైస్‌, పాస్తా, చికెన్‌, ఆయిల్‌, మిల్క్‌ ఇతర ఫుడ్‌ మరియు నాన్‌ ఫుడ్‌ ఐటమ్స్ ధరల్ని తగ్గిస్తూ విక్రయిస్తుంటారు. ధరల విషయమై ఎప్పటికప్పుడు మానటరింగ్‌ వుంటుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com