ఒమన్‌లో 5 కేఫ్‌లు, ఒక టైలర్‌ షాప్‌ మూసివేత

- April 18, 2020 , by Maagulf
ఒమన్‌లో 5 కేఫ్‌లు, ఒక టైలర్‌ షాప్‌ మూసివేత

మస్కట్‌: సౌత్‌ బతినా గవర్నరేట్‌లో జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రీజినల్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఐదు కేఫ్‌లు మరియు రెస్టారెంట్స్‌ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కమిటీ రూల్స్‌ అలాగే మినిస్టీరియల్‌ డెసిషన్‌ని ఉల్లంఘించి ఇవి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు రీజినల్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనలు బయటపడ్డాయి. కాగా, ఓ విమెన్స్‌ టైలర్‌ షాప్‌ని కూడా ఉల్లంఘనలకు పాల్పడుతున్న అభియోగాల మేరకు మూసివేశారు. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, కొన్ని కీలక రెగ్యులేషన్స్‌ని కూడా విడుదల చేశారు అధికారులు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోని వారిపై చర్యలు తప్పవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com