మరోసారి చైనాకు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
- April 19, 2020
అమెరికా:కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన వుహాన్లో కరోనా మరణాలు సంఖ్యను చైనా అకస్మాత్తుగా 50 శాతం పెంచడంతో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ను చైనా కావాలనే వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిందని తేలితే.. దానికి మూల్యం చెల్లించుకోవాలసి వస్తుందని.. దానికి చైనా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి కంటే ముందు చైనాతో తమకు మంచి సంబంధాలు ఉండేవని.. వారితో వాణిజ్య ఒప్పందం కూడా చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. అయితే.. కరోనా కేసుల విషయంలో ఆ దేశం సరైన లెక్కలు లెక్కలు చూపించడం లేదని.. కరోనా ప్రారంభంలో అమెరికాతో సహకరించలేదని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటికి కూడా కరోనా మరణాల విషయంలో చైనా చెప్తున్నవి నిజం అని నేను భావించటంలేదని.. అమెరికా కంటే చైనాలో ఎక్కువ మరణాలు సంభవించాయని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోవాలని చైనా కోరుకుంటున్నదని.. అదే జరిగితే.. అమెరికాను చైనా ఆక్రమిస్తుందని ట్రంప్ జ్యోస్యం చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







