10 మిలియన్‌ మీల్స్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించిన దుబాయ్‌

- April 20, 2020 , by Maagulf
10 మిలియన్‌ మీల్స్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించిన దుబాయ్‌

దుబాయ్‌: దుబాయ్‌ అథారిటీస్‌, అతి పెద్ద ఫుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ క్యాంపెయిన్‌ ‘10 మిలియన్‌ మీల్స్‌’ని తక్కువ ఆదాయం గల కుటుంబాల కోసం ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌ కోసం వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఇతర కంపెనీలు విరాళాలు ఇవ్వొచ్చు. దుబాయ్‌ రూలర్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్, ఆయన సతీమణి హింద్‌ బింట్‌ మక్తౌమ్ అల్‌ మక్తౌమ్ డైరెక్షన్స్‌ మేరకు ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్ గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఎంబిఆర్‌జిఐ కింద ఈ క్యాంపెయిన్‌ నిర్వహించబడుతుంది. కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా రైజ్‌ చేసిన సోషల్‌ సాలిడేటరీ ఫండ్‌ సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించడం, మరీ ముఖ్యంగా పవిత్ర రమదాన్‌ నేపత్యంలో అవసరమైనవారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ తెలిపారు. 10 మిలియణ్‌ మీల్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా, ఎంఎంఎస్‌, బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ద్వారా డొనేషన్స్‌ చేయవచ్చు. యూఏఈ ఫుడ్‌ బ్యాంక్‌ సేఫ్టీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆహారం తయారు చేయబడుతుంది. ఇదిలా వుంటే, యూఏఈలో ఇప్పటిదాకా 6,781 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 41 మంది ప్రాణాలు కోల్పోగా, 1,286 మంది కోలుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com