క్వారంటైన్‌లో కేదారనాథ్ ఆలయ అర్చకులు..
- April 20, 2020
కరోనా కారణంగా లాకడౌన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో సహా ప్రార్థనా మందిరాలన్నీ మూసి వేశారు. అయితే హిందువుల పవిత్ర ఆలయాల్లో ఒకటైన కేదారనాథ్ ఆలయాన్ని వచ్చే నెలలో తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఆలయాన్ని తెరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆలయ అధికారిని క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచుతామన్నారు. మహారాష్ట్ర నాందేడ్‌లో నివసిస్తున్న ప్రధాన అర్చకుడు భీం శకర్ ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆయన్ను క్వారంటైన్‌కి తరలించనున్నారు. ఆలయంలో పూజాదికాలు నిర్వహించే సమయంలో భక్తులతో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటారని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







