అమెరికా: 24 గంటల్లో 2,751 మంది మృతి
- April 22, 2020
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మంగళవారం ఏకంగా 2751 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో అక్కడ మరణాల సంఖ్య 45,373కు పెరిగింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అంటే 24 గంటల్లో 40 వేల కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 8,26,240కి చేరింది.
ఇక అమెరికాలో కరోనా మహమ్మారి ఈ ఏడాదిలో మరోసారి విజృంభిస్తుందని 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనాతో పాటు ఫ్లూ కూడా అదే సమయంలో ప్రతాపం చూపుతుందని తెలిపారు. రెండు ఒకేసారి విజృంభిస్తే పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం