కరోనా/యూఏఈ: కొత్తగా 3 ఫీల్డ్ ఆసుపత్రులు

- April 22, 2020 , by Maagulf
కరోనా/యూఏఈ: కొత్తగా 3 ఫీల్డ్ ఆసుపత్రులు

అబుధాబి: పెరుగుతున్న కరోనా వ్యాప్తి చెందుతుండటంతో పెరుగుతున్న రోగులకు వసతి కల్పించడానికి అబుధాబి లో కొత్తగా మూడు ఫీల్డ్ హాస్పిటల్స్ (అత్యవసర సంరక్షణ అందించడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రి) ను అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సేహా) నిర్మిస్తోంది. వీటిలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని అడ్జికారుల ప్రకటన. 

1) మూడు కొత్త ఫీల్డ్ ఆసుపత్రులలో ఒకటి అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో 31,000 చదరపు మీటర్లకు పైగా ఏర్పాటు చేయబడింది. 150 మంది నిపుణుల బృందం తో ఉన్న ఈ ఆసుపత్రిలో 1,000 పడకల సౌకర్యం కలదు. 

2) రెండవది అబుదాబి యొక్క మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ శివారులోని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీలో రూపుదిద్దుకుంటోంది. ఇది 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండి 200 మంది నిపుణుల బృందం తో ఉన్న ఈ ఆసుపత్రిలో 1,200 పడకల సౌకర్యం కలదు. మే మొదటి వారంలో ఈ సౌకర్యం సిద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

3) మూడవ ఫీల్డ్ హాస్పిటల్ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ లో ఏర్పాటుకానుంది. ఈ నెలాఖరులోగా తెరవాలని భావిస్తున్న ఈ ఆసుపత్రి 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం 200 మంది నిపుణుల బృందం తో 1200 పడకల సౌకర్యం కలదు. 

యూఏఈ ఇప్పటికే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 3,000 పడకలతో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసిన విషయం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com