వచ్చే వారం నుంచి దుబాయ్ మెట్రో పునఃప్రారంభం?
- April 23, 2020
దుబాయ్ :వచ్చేవారం నుంచి పాక్షికంగా దుబాయ్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దుబాయ్ ఎకనమిక్ డిపార్ట్మెంట్ తాజా గైడ్‌లైన్స్ నేపథ్యంలో ఈ అంచనాకి వస్తున్నారు. రెడ్‌లైన్‌లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్రాంతాలకు సంబంధించిన స్టేషన్లు మినహా మిగతావన్నీ ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. పీక్ అవర్స్‌లో వెయిటింగ్ టైమ్ మూడు నిమిషాలుగా వుండబోతోంది. దుబాయ్ మెట్రో గ్రీన్‌లైన్ ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పనిచేయనుంది.. దీనికి కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాల్లోని స్టేషన్లు పనిచేయవు. వెయిటింగ్ టైమ్ ఈ గ్రీన్లైన్కి కూడా మూడు నిమిషాలు. మాస్క్‌లను ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఎలివేటర్స్లోనూ వినియోగంపై కొన్ని ఆంక్షలు విధిస్తారు. వాటిల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం వుంటుంది. ఎప్పటికప్పుడు స్టెరిలైజేషన్ ప్రక్రియలు నిర్వహిస్తారు. ఎంట్రన్స్‌లలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!