కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 63 శాతం వలసదారులే
- April 23, 2020
మస్కట్: కరోనా వైరస్‌పై పోరాటం కోసం ఏర్పాటయిన సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 63 శాతం వలసదారులు కాగా, 37 శాతం ఒమనీయులని తెలుస్తోంది. మొత్తం 1,716 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా గుర్తించారు. 39 కేసులు హాస్పిటల్స్‌లో వుండగా, అందులో 9 ఐసీయూల్లో వున్నాయి. మొత్తం 6,807 కేసులు ఐసోలేషన్‌లో వున్నాయి. కొందరు పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. వైరస్‌కి సంబంధించి రెండు మూడు వారాల్లో పీక్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం వుంది. ప్రతిరోజూ 2000 లేబరేటరీ టెస్టులు కరోనా వైరస్ కోసం జరుగుతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 29000 కరోనా టెస్టులు జరిగాయి. పలు కేసుల్లో చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని వినియోగించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!