సూపర్‌ మార్కెట్‌లో పడిపోయిన వ్యక్తికి కరోనా వైరస్‌ లేదు

- April 25, 2020 , by Maagulf
సూపర్‌ మార్కెట్‌లో పడిపోయిన వ్యక్తికి కరోనా వైరస్‌ లేదు

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంఓపిహెచ్‌), సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియోపై స్పష్టత ఇచ్చింది. ఓ వ్యక్తి సూపర్‌ మార్కెట్‌లో పడిపోయినట్లు ఆ వీడియోలో కన్పిస్తోంది. అయితే, ఆ వ్యక్తికి కరోనా వుందంటూ, ఆ కారణంగానే ఆ వ్యక్తి చనిపోయాడనీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ వ్యక్తి నీరసంతోనే పడిపోయాడు తప్ప, కరోనా వైరస్‌తో కాదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ తరహా రూమర్స్‌ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు.

 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com