రమదాన్‌లో పేదల కోసం ఫుడ్‌ అందిస్తోన్న కెఆర్‌సిఎస్‌

- April 25, 2020 , by Maagulf
రమదాన్‌లో పేదల కోసం ఫుడ్‌ అందిస్తోన్న కెఆర్‌సిఎస్‌

కువైట్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ రోజుకి 7000 ఇఫ్తార్‌ మీల్స్‌ని రమదాన్‌ అంతటా వర్కర్స్‌ అలాగే పేదలకు కువైట్‌ వ్యాప్తంగా అందిస్తోంది. కెఆర్‌సిఎస్‌ సెక్రెటరీ జనరల్‌ మహా అల్‌ బర్జాస్‌ మాట్లాడుతూ, అల్‌ మహ్‌బౌలా, ఖైతాన్‌, అల్‌ అమిరి అండ్‌ అల్‌ సబాహ్‌ హాస్పిటల్స్‌, మెడికల్‌ వేర్‌ హౌసెస్‌, కువైట్‌ యూనివర్సిటీ, ముబారక్‌ అల్‌ కబీర్‌ గవర్నరేట్‌ తదితర ప్రాంతాల్లో పేదలకు ఈ మీల్స్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీలు, కేపబుల్‌ వ్యక్తులు అవసరమైనవారికి ఈ పవిత్ర రమదాన్‌ మాసంలో సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా అభినందించారు కెఆర్‌సిఎస్‌ సెక్రెటరీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com