బహ్రెయిన్: కోవిడ్ 19 టెస్ట్ ల్యాబ్ లు పబ్లిక్ బస్సులు...
- April 25, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బహ్రెయిన్ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా మరింత ఎక్కువ సంఖ్యలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సులనే మొబైల్ ల్యాబులుగా మార్చింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా బస్సులో అన్ని సదుపాయాలు, ఎక్విప్ మెంట్ అమర్చారు. మనామాలో ఇక నుంచి మొబైల్ ల్యాబ్ లలో పరీక్షలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి కమల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ వెల్లడించారు. మనామాలో రోడ్ల మీదకు వచ్చే వారికి ఎక్కడికక్కడ టెస్ట్ లు నిర్వహిస్తామని, తద్వారా వ్యాధి తీవ్రత ఎంత మేరకు ఉందో అంచనాకు రాగలమని మంత్రి వివరించారు. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ప్రజా రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ తమ విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇదిలాఉంటే బహ్రెయిన్ లో ప్రస్తుతం 2,518 మందికి వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 8 మంది చనిపోయారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







