అబుధాబి: మే 16 నుంచి ఎతిహాద్ విమాన సర్వీసులు ప్రారంభం
- April 25, 2020
అబుధాబి:కరోనా వైరస్ నేపథ్యంలో సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్ పౌర విమానయాన సంస్థ తమ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మే 16 నుంచి సాధారణ సర్వీసులు ప్రారంభిస్తామని సంస్థ అధికారులు వెల్లడించారు. టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి యూఏఈ ప్రభుత్వంతో పాటు గ్లోబల్ ఏవియేషన్ అధికారులతోనూ సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాక్షిక షెడ్యూల్ తోనే సర్వీసులను నడుపుతామని పరిస్థితులు చక్కబడగానే క్రమంగా పూర్తిస్థాయిలో సర్వీసులను నడుపుతామని ఎతిహాద్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. అయితే..కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ సర్వీసులు రద్దు అవటంతో ఇక్కడే చిక్కుకుపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు తరలించేందుకు యూఏఈ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించింది. మే 15 వరకు విదేశీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







