యూఏఈ:వాహనాలతో స్టంట్స్.. అజ్మన్ పరిధిలో 34 వాహనాలు సీజ్
- April 25, 2020
యూఏఈ:ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటమే కాకుండా..ఓవర్ స్పీడ్ తో స్టంట్స్ చేస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎమిరాతిలోని హేలియో జిల్లాలో మొత్తం 34 వెహికిల్స్ సీజ్ చేశారు. అయితే..ఇందులో చాలా వాహనాలకు నెంబర్ ప్లేట్లు కూడా లేవు. ఇందులో 17 మంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు వారి వెహికిల్స్ సీజ్ చేశామని, మిగిలిన 17 వాహనాలను ఓవర్ స్పీడుతో స్టంట్స్ చేసినందుకు సీజ్ చేశామని ట్రాఫిక్, పాట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అబ్ధుల్లా అల్ ఫలాసి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇతర వాహనదారులను ఇబ్బందిపెట్టేలా డ్రైవింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన వాహనాలను ఆరు నెలల పాటు మళ్లీ రోడ్డు మీదకు రాకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజా భద్రతకు భంగం కలిగించేలా రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సైఫ్ అబ్ధుల్లా...ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేసిన వారి గురించి 901 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే..999కి ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







