మీరు కోవిడ్ -19 రోగితో సంబంధం కలిగి ఉన్నారో లేదో ఈ యాప్ తో తెలుసుకోవచ్చు
- April 26, 2020
యూఏఈ: కరోనా ధాటికి ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. బయటకి వెళ్లాలంటే భయం..ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో, ఎవరి వల్ల మనకి అంటుతుందో అనే భయం మనల్ని వెంటాడుతోంది. దీనికి ఒక ఉపాయం ఆలోచించారు యూఏఈ అధికారులు..
యూఏఈ, ఇప్పుడు బయటకు వెళ్లేందుకు ఆంక్షలను సడలించింది, అయితే మన భద్రత కోసం ఒక యాప్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ఎవరికి కరోనా ఉందో తెలుస్తుంది తద్వారా మనం ఆ వ్యక్తి తో ఎటువంటి పరిచయం ఉన్నా, వెంటనే గృహ నిర్బంధానికి వెళ్లేందుకు సులభం అవుతుందని ఈ సందర్భంగా అధికారాలు వెల్లడించారు.

ఏమిటి ఈ యాప్?
'అల్ హోస్న్ అల్ రక్మి' అని పిలువబడే ఈ అప్లికేషన్ వైరస్ బారిన పడిన వ్యక్తులను గుర్తించడానికి అనువుగా ఉంటుందని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మోహప్) డాక్టర్ అమేనా అల్ షమ్సీ తెలిపారు. ఇందులో ప్రతి వినియోగదారుడుకు ఒక QR కోడ్ను ఇవ్వటం జరుగుతుంది. ఈ కోడ్ లో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమవుతుంది అని ఆమె తెలిపారు. తద్వారా ఎవరైనా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సంబంధం ఉన్నదీ/లేనిదీ గుర్తించేందుకు వీలవుతుంది అని అమేనా తెలిపారు.
యూఏఈ లో ఆంక్షలను సడలించినా, కఠినమైన భద్రతా చర్యలు ఇప్పటికీ వర్తిస్తాయని డాక్టర్ అల్ షంసీ అందరికీ గుర్తు చేశారు. "ఆంక్షలను సడలించడం అంటే భద్రతా సూచనలకు పాటించడం మానేయమని కాదు. ప్రతి ఒక్కరూ అధికారిక సూచనలను పాటిస్తూ ఈ కరోనా ను ఎదుర్కొనేందుకు సహకరించాలి" అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







