గల్ఫ్ నుండి పెరుగుతున్న ఒత్తిడి.. పౌరులను తరలించడానికి భారత్ సన్నాహాలు
- April 26, 2020
భారతీయులకు శుభవార్త..
యూఏఈ: విదేశాలలో చిక్కుకున్న పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని తెలుస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియా సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విదేశాలలో ఉన్న భారత మిషన్లతో విదేశాంగ శాఖ కలిసి పనిచేస్తోందని అధికారులు తెలిపారు. కానీ, విమాన సర్వీసులు ఇండియాలో లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత మాత్రమే ప్రారంభిస్తారని తెగేసి చెప్పేసారు.
చార్జీలు ఎంత?
ప్రత్యేక లేదా సాధారణ విమానాల ద్వారా తరలింపులు నిర్వహించబడతాయి. ఇండియాలోని లాక్డౌన్ స్థితిని బట్టి ఆయా రాష్ట్రానికి చార్జీలు మారుతూ ఉంటాయి. ఈ చార్జీలు ప్రయాణీకులు భరించాలని అధికారులు అంటున్నారు.
ఏఏ దేశాలకు ప్రాధాన్యత?
భారతీయులు ఇండియాకు తిరిగి రావడానికి గల్ఫ్ దేశాల నుండి దేశం తీవ్ర ఒత్తిడికి గురైంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లతో సహా గల్ఫ్ దేశాల్లోని పౌరులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రణాళికలు సూచిస్తున్నాయి. అటుపై UK, సా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలలో చిక్కుకున్నవారిని అనుమతిస్తారు.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి మరియు 1.3 బిలియన్లకు పైగా జనాభాను కాపాడటానికి మార్చి 25 నుండి భారతదేశం దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉంది. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఆంక్షలు సడలించబడుతున్నాయని, మే 3 న ఎత్తివేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చివరి ఆదేశాల మేరకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







