దోహా:తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

- April 26, 2020 , by Maagulf
దోహా:తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర  సరుకుల పంపిణీ

దోహా:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో దోహా కతర్ లోని తెలంగాణ ప్రవాస కార్మికులు ఉపాధి లేక తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న విషయం తెలంగాణ ప్రజా సమితి దృష్టికి రాగా వెంటనే స్పందించి వారి వివరాలు మొత్తం సేకరించి సుమారు నలబై మంది కార్మికులకు ఈరోజు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష-ఉపాధ్యక్షులు  చెనవేని తిరుపతి గద్దె శ్రీనివాస్ మరియు తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపక సభ్యులు ధర్మరాజు యాదవ్ పంచిత వేణుగోపాల్ పడకంటి గొర్రె కొమురన్న  తదితరులు పాల్గొని స్వయంగా బాధితులకు వస్తువులు పంపిణీ చేశారు.
ఎవరు కూడా అధైర్య పడొద్దని 
తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడూ అండగా ఉంటుందని 
ఏ అవసరం ఉన్న tps హెల్ఫ్ లైన్ (00974 50816663) కి కాల్ చేయాలని సూచించారు.

ఆపత్కాలంలో స్పందించి సరుకులు పంపిణీ చేసినందుకు గాను బాధితులు అందరూ తెలంగాణ ప్రజా సమితి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com