భారత్‌, కువైట్‌ మధ్య విడదీయరాని సన్నిహిత సంబంధాలు: కువైట్‌ రాయబారి

- April 27, 2020 , by Maagulf
భారత్‌, కువైట్‌ మధ్య విడదీయరాని సన్నిహిత సంబంధాలు: కువైట్‌ రాయబారి

కువైట్‌:భారతదేశంలో కువైట్‌ రాయబారి జస్సెమ్ అల్‌ నజీమ్, భారత్‌ మరియు కువైట్‌ మధ్య సన్నిహిత సంబంధాలకు చారిత్రక నేపథ్యం వుందని అన్నారు. ఇరు దేశాలూ పలు అంశాలపై కలిసి ముందడుగు వేస్తున్నాయని చెప్పారు. పొలిటికల్‌, ఎకనమిక్‌ డొమైన్స్‌ విషయాల్లో భారత్‌ - కువైట్‌ ఎప్పుడూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇరు దేశాలూ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయనీ, పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఫారిన్‌ పాలసీస్‌ విషయంలో ఈ రెండు దేశాల వ్యవహార శౖలి దాదాపు ఒకేలా వుంటోందని చెప్పారు. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన కీలక సమావేశం కరోనా వైరస్‌ కారణంగా రద్దయినట్లు చెప్పారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com