ముఖ్యమంత్రులతో ముగిసిన ప్రధాని సమావేశం..
- April 27, 2020
ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తరువాత లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. కేంద్రం ప్రజలకు కొన్ని నిబంధనలను సడలించనుందని తెలుస్తోంది. 9 మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ గురించి అభిప్రాయాలను పంచుకోగా నలుగురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు.
ముఖ్యమంత్రులు ప్రధానంగా నిత్యావసరాలను, మరిన్ని విభాగాలను అనుమతించాలని కోరినట్టు పీఎం అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేంద్ర బృందాల పర్యటన అనంతరం వారి అభిప్రాయాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు ప్రకటన చేశాయి. కేంద్రం ప్రధానంగా గ్రీన్ జోన్ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు అంగీకరించిందని తెలుస్తోంది. హాట్ స్పాట్ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో వాణిజ్య సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది.
ప్రజా రవాణా గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. కేంద్రం ప్రజా రవాణా విషయంలో కూడా కొన్ని వెసులుబాట్లను కల్పించనుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు