కార్మికుల హక్కుల ఉల్లంఘనల్ని గుర్తించిన ఒమన్ వర్కర్స్ ఫెడరేషన్
- April 27, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, ఐదు రోజుల్లో కార్మికుల హక్కులకు సంబంధించి 19 ఉల్లంఘనల రిపోర్ట్స్‌ని గుర్తించింది. వేతనాల తగ్గింపు, అన్‌పెయిడ్ లీవులపై కార్మికుల్ని పంపడం, వార్షిక సెలవుల నుంచి క్వారంటైన్ పీరియడ్స్‌ని తొలగించడం వంటి ఉల్లంఘనలు వీటిల్లో వున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆన్‌లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య మొత్తం 19 రిపోర్టులు నమోదయ్యాయి. సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ప్రైవేటు సెక్టార్ సంస్థలు పనిచేయాల్సి వుంటుందనీ, కార్మికుల హక్కులకు భంగం కలిగించరాదని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు