యూఏఈ నుంచి ఎట్టకేలకు భారత్ చేరుకున్న NRIల మృతదేహాలు
- April 27, 2020
అబుధాబి:యూఏఈలో చనిపోయిన ముగ్గురు ఎన్ఆర్ఐల మృతదేహాల తరలింపులో ఎట్టకేలకు గందరగోళం తొలగిపోయింది. అబుధాబి నుంచి శనివారం కార్గో విమానంలో ముగ్గురి మృతదేహాలను తరలించగా..ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అధికారులు మృతుల కుటుంబాలకు మృతదేహాలను అందించినట్లు యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలో ఎన్ఆర్ఐలు కమలేష్ భట్, సంజీవ్ కుమార్, జగ్సిర్ సింగ్ యూఏఈలో మృతిచెందారు. అయితే...కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంలో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం కార్గో విమానంలో ఢిల్లీ తరలించారు. అయితే..వారి మృతికి కరోనా వైరస్ కారణం కాకపోయినా..సరైన అనుమతులు లేని కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మృతదేహాలను మళ్లీ యూఏఈ తిప్పిపంపించారు. దీంతో ప్రవాస భారతీయుల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ముగ్గురు ఎన్ఆర్ఐల మృతికి కోవిడ్ కారణం కాకపోయినా ఎందుకు తిప్పిపంపారనే దుమారం చెలరేగింది. అయితే..దీనిపై స్పందించిన భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళిధరన్..కార్గో విమానాల్లో మృతదేహాల తరలింపునకు సంబంధించి సరైన మార్గదర్శకాలు లేవని అందుకే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వివరణ కూడా ఇచ్చారు.
ప్రవాస భారతీయుల మృతదేహాలు ఢిల్లీ నుంచి మళ్ళీ అబుధాబికి తిప్పిపంపటంతో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక అధికారులు ఆయోమయపడి ఉంటారని విపుల్ అభిప్రాయపడ్డారు. అయితే..కరోనా వైరస్ తో చనిపోయిన వారి మృతదేహాలను పంపించటం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే..ఎన్ఆర్ఐల మృతికి కరోనా వైరస్ కారణం కాకపోయినా..వారి మృతదేహాల తరలింపులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంచాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలు, హై కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయని..బహుశ ఈ నేపథ్యంలోనే గందరగోళం నెలకొని ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!