APNRTS ‘కరోనా’ సాయం!

- April 27, 2020 , by Maagulf
APNRTS ‘కరోనా’ సాయం!

యూ.ఏ.ఈ:ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(APNRTS) కో-ఆర్డినేటర్లు జఫ్ఫార్‌ అలీ, వాసు పొడిపిరెడ్డి, తెలుగు కమ్యూనిటీకి చెందిన 50 గ్రూపులకు 50 కిట్స్‌ని అందించారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ ఈ కిట్స్‌ని స్పాన్సర్‌ చేయడం జరిగింది. ఒక్కో గ్రూపులో ఐదుగురు వ్యక్తులు వుంటారు. ఉద్యోగం కోల్పోయిన మెయిడ్స్‌, అన్‌ ఎంప్లాయ్డ్‌ క్లీనర్స్‌, అన్‌ ఎంప్లాయ్డ్‌ విజిట్‌ వీసా హోల్డర్స్‌ వంటివారు ఈ గ్రూపులో వున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాగా, లబ్దిదారులు మలబార్‌ గోల్డ్‌ అలాగే ఎపిఎన్‌ఆర్‌టి టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com