దుబాయ్:కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్స్ స్టంట్ లైసెన్స్ ఫీజు 90% తగ్గింపు

- April 27, 2020 , by Maagulf
దుబాయ్:కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్స్ స్టంట్ లైసెన్స్ ఫీజు 90% తగ్గింపు

దుబాయ్:కరోనా వైరస్ నేపథ్యంలో ఒడిదుడిగులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా దుబాయ్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక, వ్యాపార వర్గాల ప్రొత్సహానికి ఇచ్చే ఇన్స్ స్టంట్ లైసెన్స్ ఫీజును ఏకంగా Dh3,000 నుంచి Dh250కి తగ్గించింది. ఇన్స్ స్టంట్ లైసెన్స్ రెన్యూవల్ కి కూడా ఇదే ఫీజు వర్తిస్తుందని తెలిపింది. లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ఏక వ్యక్తి ఎల్ఎల్సీ, సోలో పార్ట్నర్ షిప్, సివిల్ కంపెనీలకు ఇన్ స్టంట్ లైసెన్సింగ్ పరిధిలోకి వస్తాయి. అలాగే సాధారణ వ్యాపార కార్యాకలాపాల కోసం ఔత్సాహిక వ్యాపారవేత్తలు జనరల్ కమర్షియల్ లైసెన్స్ ఆన్ లైన్ లో పొందవచ్చు. అంతేకాదు ట్రేడ్ లైసెన్స్ ద్వారా దుబాయ్ ఛాంబర్ లో సభ్యత్వం కూడా తక్షణమే పొందవచ్చు. ఇక రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్ డైరెక్టరేట్ కార్డుతో పాటు  యజమానికి మూడు వర్క్ పర్మిట్లకు మానవ వనరుల శాఖ నుంచి అనుమతులు దక్కుతాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై పలువురు వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జితేంద్ర కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్ జితేంద్ర మాట్లాడుతూ...లైసెన్స్ ఫీజు 90 శాతం తగ్గించటం స్వాగతించదగ్గర పరిణామమని అన్నారు. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలకు ఇది ఎంతో ప్రొత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గడ్డుకాలాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రభుత్వం వీసా పొడిగింపు లాంటి పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆర్ధిక పురోభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని జితేంద్ర అశాభావం వ్యక్తం చేశారు.

డబ్ల్యూటీఎస్ ధృవ కన్సల్టెన్సీ నిమేష్ గోయల్ మాట్లాడుతూ..లైసెన్స్ ఫీజు తగ్గింపు, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాలు స్థానికంగా బిజినెస్ వెంచర్స్ ప్రారంభానికి ఎంతో ప్రొత్సహకరంగా ఉంటుందన్నారు. యువ ప్రతిభావంతులకు, స్టార్టప్ కంపెనీలకు దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వ్యాపార వర్గాలకు ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com