బిచ్చగాళ్లకు దానాలు చేయొద్దు..దుబాయ్ పోలీసు హెచ్చరిక
- April 28, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దానధర్మాలు నిర్వహించాలనుకునే వారి యూఏఈలోని అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాని ఎవరూ బిచ్చగాళ్లకు డబ్బులు దానం చేయొద్దని హెచ్చరించింది. పుణ్యం పేరుతో సులువుగా డబ్బు సంపాదించే యాచకులను ప్రొత్సహించకూడదని తెలిపింది. యూఏఈ చట్టాల ప్రకారం బిచ్చమెత్తుకోవటం నిషేధం. యాచించటం కూడా ఒక రకంగా దొంగతనం లాంటిదేనని పోలీసులు అభిప్రాయపడ్డారు. సులువుగా డబ్బు సంపాదనకు అనారోగంతో బాధపడుతున్న వారిని, చిన్నపిల్లల్ని ఓ అవకాశంగా వాడుకొని జాలి కలిగించేలా ప్రేరేపిస్తారని అధికారులు వివరించారు. అందుకే బిచ్చమెత్తుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించవద్దన్నారు. రమదాన్ మాసం..పైగా కరోనా సంక్షోభాన్ని సింపతిగా వాడుకొని ఎవరైనా యాచించిట్లు కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. బిచ్చగాళ్లను గుర్తించేందుకు ఇప్పటికే పలు చోట్ల పాట్రోలింగ్ పెంచామని, ఎవరైనా యాచించినట్లు కనిపిస్తే 901కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







