మస్కట్:అనవసరమైన వీడియో కాల్స్ ను మానుకోండి..టీఆర్ఏ సూచన

- April 28, 2020 , by Maagulf
మస్కట్:అనవసరమైన వీడియో కాల్స్ ను మానుకోండి..టీఆర్ఏ సూచన

మస్కట్:ఇంటర్నెట్ ను వినోదం కోసం వినియోగించుకోవటాన్ని నియంత్రించుకోవాలని టెలికం రెగ్యూలేటరి అధారిటి వినియోగదారులను కోరింది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనవసరంగా ఇంటర్నెట్ వాడొద్దని సూచించింది. ఆ సమయంలో ఈ-లెర్నింగ్, హెల్త్ కేర్, వివిధ ఆఫీసులు తమ లక్ష్యాలను నేరవేర్చేందుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఏ కోరింది. ఆఫీస్ అవర్స్ లో ఇంటర్నెట్ ను వినోదాల కోసం వినియోగిస్తే నెట్ వర్క్ పై లోడ్ ఎక్కువై కీలకమైన సేవా రంగాలకు ఇంటర్నెట్ స్పీడు తగ్గే అవకాశాలు ఉంటాయని వివరించింది.

అంతేకాదు..వీలైనంత వరకు ప్రజలు వీడియో కాల్స్ నియంత్రించుకోవాలని, పీక్ అవర్స్ సమయంలోనే కాదు..సాధారణ సమయాల్లోనూ వీడియో కాల్స్ ను చేయకపోవటమే మంచిదని సూచించింది. నెట్ వర్క్ పై లోడ్ తగ్గించేందుకు వీడియో కాల్స్ కి బదులు ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసుకోవాలని టెలికం రెగ్యూలేటరి అధికారులు కోరారు. అలాగే పిల్లలను కూడా ఇంటర్నెట్ లో వీడియోలు చూడటాన్ని కూడా మాన్పించాలని..దానికి బదులు ఇతర కాలక్షేప మార్గాలను వారికి సూచించాలని తల్లిదండ్రులను అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com