యూ.ఏ.ఈ:అజ్మాన్ కార్మికులను ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు
- April 29, 2020
అజ్మాన్: అల్ జుర్ఫ్ 3 ఇన్డిస్ట్రియాల్ ఏరియాలోని వర్కర్స్ క్యాంపు లో 12 మంది భారతీయ కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు అజ్మన్ కెఎంసిసి(కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి గత రాత్రి వీరందరిని తరలించటం జరిగింది.
ఈ 3 అంతస్తుల భవనంలో అన్ని వసతులతో కూడిన 84 గదులు కలవు.ఈ గదులలో గరిష్టంగా ఇద్దరు ఉండేడట్టుగా ఏర్పాట్లు చేశారు.రోగులకు కావాల్సిన నిత్యావసరాలను అజ్మాన్ కెఎంసిసి అందిస్తోంది.మెట్రో మెడికల్ సెంటర్ కి చెందిన వైద్య బృందం రోగులను పర్యవేక్షిస్తూ తగిన వైద్యం అందిస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కెఎంసిసి చూపిన చొరవకు హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్.ఈ సంధర్భంగా కార్మికులు తమకు సహాయ సహకారాలు అందించిన ఇండియన్ అసోసియేషన్,అజ్మాన్ , కెఎంసిసి(అజ్మాన్) ప్రెసిడెంట్ సూపీ పాతిరపట్టకు మరియు టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు