ఇండియన్‌ రెసిడెన్సీ ఉల్లంఘనులు వచ్చేవారం స్వదేశానికి

- April 29, 2020 , by Maagulf
ఇండియన్‌ రెసిడెన్సీ ఉల్లంఘనులు వచ్చేవారం స్వదేశానికి

కువైట్:భారత్-ఈజిప్ట్‌ దేశాలకు చెందిన ప్రభుత్వాలతో జరిగిన చర్చల నేపథ్యంలో రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన ఆయా దేశాలకు చెందిన వలసదారులు తమ స్వదేశాలకు వెళ్ళేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ప్రత్యేక విమానాలు ఆపరేట్‌ కానున్నాయి. కువైట్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీని వినియోగించుకునేందుకు పెద్దయెత్తున ఉల్లంఘనులు ముందుకొచ్చారు. కాగా, ఇండియాలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో 500 మందికి పైగా ఇండియన్స్‌ని తీసుకెళ్ళేందుకు కొంత సమయం పట్టవచ్చు. మే 3 తర్వాత ఇండియాలో లాక్‌డౌన్‌ ముగిసే అవకాశం వున్నందున, వచ్చేవారం వీరంతా స్వదేశానికి పయనమవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com