సౌదీలో చలి తీవ్రతతో స్కూల్స్‌ మూసివేత

- January 28, 2016 , by Maagulf
సౌదీలో చలి తీవ్రతతో స్కూల్స్‌ మూసివేత

సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో మంచు కురిసింది. అరార్‌ సిటీ మరియు హజ్మ్‌ అల్‌ జలామీద్‌లలో మంచు కురియడంతోపాటు, శీతలగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అదికారులు అన్ని స్కూళ్ళలోనూ తరగతులకు సెలవు ప్రకటించారు. మరింత మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సౌదీ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ, కష్టతరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంతవరకు రోడ్లపై ప్రయాణాలు మంచివి కాదని హెచ్చరించారు. చిన్న పిల్లలు, వృద్ధులు వెచ్చదనం కోసం తగిన శ్రద్ధ తీసుకోవాలని అధికారులు చెప్పారు. సున్నా స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయకారిగా ఉండేందుకు అధికారులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com